Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అల్లర్లలో పాల్గొంటే పాస్‌పోర్ట్ రద్దు: ఢిల్లీ పోలీసుల హెచ్చరిక

Follow Udayam on Google
ధీరజ్ రెడ్డి Jul 24, 2026 11:16 AM జాతీయంGeneral
అల్లర్లలో పాల్గొంటే పాస్‌పోర్ట్ రద్దు: ఢిల్లీ పోలీసుల హెచ్చరిక - Udayam
హింసాత్మక నిరసనల్లో పాల్గొనేవారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు ఢిల్లీ పోలీసులు సిద్ధమవుతున్నారు. చట్టపరమైన చర్యలతో పాటు అల్లర్లకు పాల్పడినట్లు తేలితే వారి పాస్‌పోర్ట్‌లను కూడా రద్దు చేయాలని నిర్ణయించారు. ఇటీవల 'చలో పార్లమెంట్' మార్చి సందర్భంగా నిరసనకారులు బారికేడ్లను తోసుకుని హింసకు దిగడంతో పోలీసులు లాఠీఛార్జ్, బాష్పవాయుగోళాలు ప్రయోగించారు. ఈ ఘటనల నేపథ్యానే పోలీసులు ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు.

Comments

G
Loading comments...