Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దేశ్య తండాలో తాగునీటి కోసం మహిళల నిరసన

Follow Udayam on Google
Kiran Oct 14, 2026 10:01 AM మహబూబాబాద్ General
దేశ్య తండాలో తాగునీటి కోసం మహిళల నిరసన - Udayam
గార్ల మండలం చిన్న కిష్టాపురం పంచాయతీ పరిధిలోని దేశ్య తండాలో వారం రోజులుగా తాగునీరు సరఫరా కావడం లేదని గ్రామస్థులు తెలిపారు. దీంతో మహిళలు, గ్రామస్థులు ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. మిషన్ భగీరథ, గ్రామపంచాయతీ పంపుల ద్వారా నీరు అందక ప్రజలు, మూగజీవాలు ఇబ్బందులు పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మోటర్లు కాలిపోయాయని అధికారులు చెబుతున్నారని, సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరారు.

Comments

G
Loading comments...