వార్తలకు తిరిగి వెళ్లండి

కేంద్రంలోని బీజేపీ ప్రజావ్యతిరేక విధానాల వల్ల దేశ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని సీపీఐ కరీంనగర్ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ విమర్శించారు. కరీంనగర్ రూరల్ మండలంలోని బొమ్మకల్, గుంటూరుపల్లి, మొగ్దుంపూర్ గ్రామాల్లో నిర్వహించిన ప్రచార జాతాలో ఆయన మాట్లాడారు.
నిత్యావసరాలు, ఇంధన ధరల పెంపుతో సామాన్యులపై భారం పడిందన్నారు. ఉద్యోగాల హామీ విస్మరించిన బీజేపీకి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు.
Comments
Loading comments...

