వార్తలకు తిరిగి వెళ్లండి

భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని టాటా సన్స్ ఛైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ అన్నారు. దీర్ఘకాలిక స్థిరమైన వృద్ధికి ఇంధన భద్రత, తయారీ రంగంలో ఉద్యోగాల కల్పన, మానవ వనరులపై పెట్టుబడులు కీలకమని పేర్కొన్నారు.
దేశీయ డిమాండ్, సేవల ఎగుమతులు, అనుకూల ప్రభుత్వ విధానాలతో భారత వృద్ధి కొనసాగుతోందన్నారు.తయారీ రంగంలో నాణ్యత, ఆవిష్కరణలు,దృష్టి పెడితే పెద్ద కంపెనీలతో పాటు మధ్యతరహా పరిశ్రమలు కూడా పుంజుకుంటాయని చెప్పారు.
Comments
Loading comments...

