వార్తలకు తిరిగి వెళ్లండి

నారాయణపేట జిల్లాలో జింకలు, నెమళ్ల గుంపులు పంట పొలాలపై దాడి చేయడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షాభావంతో ఇప్పటికే నష్టపోయిన పత్తి, కంది పంటలు వన్యప్రాణుల దాడులతో మరింత దెబ్బతింటున్నాయి.
ధన్వాడ మండలంలో పంట మొక్కలను జింకలు, నెమళ్లు ధ్వంసం చేస్తున్నాయని రైతులు చెబుతున్నారు. పెట్టుబడులు కూడా తిరిగి వచ్చే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

