వార్తలకు తిరిగి వెళ్లండి
తగ్గిన ఉద్యాన పంటల సాగు

ఎల్‌నినో వర్షాభావ పరిస్థితుల వల్ల తెలంగాణలో ఉద్యాన పంటల సాగు గణనీయంగా తగ్గింది. నిరుడు 11.24 లక్షల ఎకరాల్లో సాగుండగా, ఈ ఏడాది అది 9.51 లక్షల ఎకరాలకే పరిమితమైందని ఉద్యాన శాఖ తెలిపింది.
కూరగాయలు, పసుపు, మిర్చితో కలిపి మొత్తం 1,72,867 ఎకరాల విస్తీర్ణం తగ్గింది. వర్షాలు కురిస్తే ఈ సాగు పెరిగే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది.
Comments
Loading comments...