వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ప్రమాదాలు నిత్యకృత్యమయ్యాయి. డ్రైవర్ల అతివేగం, నిర్లక్ష్యం కారణంగా ఈ ఏడాది ఇప్పటివరకు 212 ప్రమాదాలు జరిగి 109 మంది మరణించారు. ఎక్కువగా చౌటుప్పల్, చిట్యాల పరిధిలో ప్రమాదాలు జరుగుతున్నాయి.
నిబంధనలు ఉల్లంఘిస్తూ గంటకు 140 కి.మీ వేగంతో వాహనాలు నడుపుతుండటం ప్రాణాల మీదకు తెస్తోంది. ప్రైవేటు ట్రావెల్స్ డ్రైవర్ల నిద్రమత్తు, వేగ నియంత్రణ పాటించకపోవడమే ఈ దుర్ఘటనలకు ప్రధాన కారణమని పోలీసుల గణాంకాలు చెబుతున్నాయి.
Comments
Loading comments...

