Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో రూ.1.87 లక్షల జరిమానా

Follow Udayam on Google
Kiran Nov 06, 2026 11:28 AM రంగారెడ్డి General
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో రూ.1.87 లక్షల జరిమానా - Udayam
మలక్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో పట్టుబడిన 35 మందికి నాంపల్లి తొమ్మిదో కోర్టు రూ.1,87,500 జరిమానా విధించినట్లు ట్రాఫిక్ సీఐ ఆదిరెడ్డి తెలిపారు. వీరిలో 32 మంది ద్విచక్ర వాహనదారులు, ఇద్దరు త్రిచక్ర వాహనదారులు, ఒకరు కార్ డ్రైవర్ ఉన్నారు. బీఏసీ స్థాయిని బట్టి 18 మందికి కమ్యూనిటీ సర్వీస్, మరో ఇద్దరికి 3 నుంచి 5 రోజుల జైలు శిక్ష విధించినట్లు ఆయన వెల్లడించారు.

Comments

G
Loading comments...