వార్తలకు తిరిగి వెళ్లండి
డ్రగ్స్ రహిత సమాజ స్థాపనకు ప్రతి పౌరుడు బాధ్యత వహించాలి
మాదకద్రవ్యాల నిరోధకానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 'ఈగల్' కార్యక్రమానికి ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. రంగంపేట మండలం ముకుందవరంలో 'ఈగల్-1972' ప్లకార్డులను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రగ్స్ రహిత సమాజ స్థాపనకు ప్రతి పౌరుడు బాధ్యత వహించాలన్నారు. మాదకద్రవ్యాల సమాచారాన్ని 1972 హెల్ప్‌లైన్‌కు అందించాలని సూచించారు.
Comments
Loading comments...