వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరులో డీఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త ఎంసీ విజయానంద రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ, డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందించి నిరసన వ్యక్తం చేశారు.
Comments
Loading comments...
