Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డ్రైవింగ్‌లో సినిమా చూస్తూ, హెడ్‌ఫోన్లు వాడటంపై సజ్జనార్ ఆగ్రహం

Follow Udayam on Google
Harika Oct 14, 2026 11:38 AM హైదరాబాద్General
ఆటో నడుపుతూ ఒక ఫోన్‌లో నేవిగేషన్, మరో ఫోన్‌లో సినిమా చూస్తున్న డ్రైవర్ వీడియోపై వీసీ సజ్జనార్ స్పందించారు. డ్రైవింగ్‌లో మొబైల్, హెడ్‌ఫోన్ల వాడకం ప్రాణాలకు ప్రమాదమని హెచ్చరించారు. TG15U2657 నంబర్‌ ఆటో డ్రైవర్‌ను గుర్తించి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులను ఆదేశించారు. డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే 112కు ఫోన్ చేయాలని సూచించారు.

Comments

G
Loading comments...