Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డిచ్పల్లి డిగ్రీ కళాశాలకు సొంత భవనం నిర్మించాలి

Follow Udayam on Google
RR REDDY Sep 10, 2026 6:26 PM నిజామాబాద్General
డిచ్పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు నూతన సొంత భవనం నిర్మించి, మౌలిక వసతులు కల్పించాలని పీడీఎస్‌యూ డిమాండ్ చేసింది. ఈ మేరకు కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టి అదనపు కలెక్టర్ భుజంగరావుకు వినతిపత్రం అందజేశారు. ప్రస్తుతం తరగతి గదులు అధ్వానంగా ఉన్నాయని, తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్, ఫర్నిచర్ వంటి సదుపాయాలు కల్పించాలని కోరారు. కార్యక్రమంలో పీడీఎస్‌యూ నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...