వార్తలకు తిరిగి వెళ్లండి

ఇ-కామర్స్ డెలివరీ సేవలపై కొత్తగా 5 శాతం జీఎస్టీ విధించారంటూ జరుగుతున్న ప్రచారం అవాస్తవమని కేంద్రం స్పష్టం చేసింది. ఫుడ్ డెలివరీ యాప్‌లపై కొత్త పన్ను విధించలేదని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం తెలిపింది.
గతంలో 18 శాతంగా ఉన్న జీఎస్టీని 57వ జీఎస్టీ కౌన్సిల్ 5 శాతానికి తగ్గించిందని సీబీఐసీ వివరించింది. తప్పుడు వార్తలను నమ్మవద్దని, అధికారిక సమాచారాన్ని పరిశీలించిన తర్వాతే షేర్ చేయాలని సూచించింది.
Comments
Loading comments...

