Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డబ్బులు తీసుకుని కన్నతల్లిని వదిలేసిన కుమార్తె

Follow Udayam on Google
భవేష్ కుమార్ Jul 14, 2026 7:01 AM కడపGeneral
డబ్బులు తీసుకుని కన్నతల్లిని వదిలేసిన కుమార్తె - Udayam
బి.మఠం మండలం పి.చెన్నుపల్లెకు చెందిన వృద్ధురాలు దస్తగిరమ్మ పొలం అమ్మిన డబ్బును నమ్మి తన కుమార్తెకు ఇచ్చారు. డబ్బు తీసుకున్న కొద్దిరోజులకే కుమార్తె ఆమెను పట్టించుకోవడం మానేసి, తిండి కూడా పెట్టకుండా వేధించడం మొదలుపెట్టింది. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన సదరు వృద్ధురాలు న్యాయం చేయాలంటూ ఆటోలో సోమవారం స్థానిక పోలీస్ స్టేషన్‌కు చేరుకుని అధికారులను ఆశ్రయించారు.

Comments

G
Loading comments...