Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దౌడేపల్లి పాఠశాలలో ప్రజా పాలన దినోత్సవం

Follow Udayam on Google
p.g.murthy Sep 17, 2026 10:27 AM మంచిర్యాలGeneral
దౌడేపల్లి పాఠశాలలో ప్రజా పాలన దినోత్సవం - Udayam
లక్షెట్టిపేట మండలంలోని దౌడేపల్లి ప్రభుత్వ పాఠశాలలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు గురువారం ఉదయం పాఠశాల ఆవరణలో హెచ్ఎం, ఉపాధ్యాయులు కలిసి జాతీయ జెండాను ఎగరవేశారు. నిజాం ప్రభువు నుండి తెలంగాణ విమోచనం అయిన సందర్భంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం నిర్వహించామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...