Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొరవడిన తారు.. రోడ్ల నిర్మాణానికి ఆటంకం

Follow Udayam on Google
రమేష్ బాబు Jul 20, 2026 8:34 AM పశ్చిమగోదావరి General
కొరవడిన తారు.. రోడ్ల నిర్మాణానికి ఆటంకం - Udayam
యుద్ధ పరిణామాల ప్రభావంతో తారు సరఫరా 70 శాతం తగ్గిపోవడంతో జిల్లాలో బీటీ రోడ్ల నిర్మాణ పనులకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. కొరత కారణంగా తారు ధర టన్నుకు రూ.40 వేల నుంచి రూ.90 వేలకు పెరగడంతో కాంట్రాక్టర్లు పనులు ముందుకు తీసుకెళ్లలేకపోతున్నారు. టెండర్లు పూర్తయి నిధులు మంజూరైనప్పటికీ రోడ్ల పనులు నిలిచిపోవడంతో వర్షాల వేళ ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. అందుబాటులో ఉన్న తారుతోనే ప్రాధాన్యత క్రమంలో పనులు చేపడతామని అధికారులు చెబుతున్నారు.

Comments

G
Loading comments...