వార్తలకు తిరిగి వెళ్లండి

ఏ.కొండూరు మండలంలోని రేపూడి, పడమర, మాధవరం, ఎల్.జి. తండాల్లో తుఫాను వర్షాలు, గాలులకు వందలాది ఎకరాల్లో మిర్చి, పత్తి పంటలు దెబ్బతిన్నాయి. పూత, పిందె దశలో ఉన్న పంటలు పూర్తిగా నష్టపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎకరాకు రూ.60-70 వేల వరకు పెట్టుబడి పెట్టామని ఏఐకేఎం నేత హరిచంద్ తెలిపారు. గ్రామాల వారీగా సర్వే నిర్వహించి తక్షణమే నష్టపరిహారం అందించాలని రైతులు డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

