వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం దామస్తాపూర్-షాపూర్ ప్రధాన రహదారి పనులు మధ్యలోనే నిలవడంతో భారీ వర్షాలకు బురదమయంగా మారింది. ద్విచక్ర వాహనాలు జారిపడుతుండటంతో నిత్యం రాకపోకలు సాగించే విద్యార్థులు, ఉద్యోగులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
ప్రమాదాలు జరగకముందే R అండ్ B అధికారులు స్పందించి, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా నిలిచిన రోడ్డు పనులను వెంటనే పూర్తి చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
Comments
Loading comments...

