వార్తలకు తిరిగి వెళ్లండి

విజయవాడ 26వ డివిజన్ చుట్టుగుంటలో ముస్లిం సమైక్య వేదిక ఆధ్వర్యంలో సుమారు 30 మంది పేద మహిళలు, వితంతువులకు నిత్యావసర సరుకులు, బియ్యం, కూరగాయలు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే బోండా ఉమ ముఖ్య అతిథిగా పాల్గొని లబ్ధిదారులకు సరుకులు అందజేశారు.
పేదలు, వితంతువులకు అండగా నిలవడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతని బోండా ఉమ అన్నారు. వేదిక నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాన్ని ఆయన అభినందించారు.
Comments
Loading comments...

