వార్తలకు తిరిగి వెళ్లండి

గుర్ల మండలంలోని చుక్కపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గుజ్జంగివలస గ్రామానికి చెందిన నాసరి మోహన్ (21) మృతి చెందాడు.
పోలీసుల సమాచారం మేరకు గుజ్జంగివలస నుంచి చీపురుపల్లి వెళ్తుండగా చుక్కపేట వద్ద లారీ ఢీకొనడంతో మోహన్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు పెయింటింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ ఘటనపై గుర్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

