Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చట్టాలపై అవగాహనతో మోసాలకు చెక్

Follow Udayam on Google
Anuroop Oct 08, 2026 4:39 PM కోనసీమGeneral
చట్టాలపై అవగాహనతో మోసాలకు చెక్ - Udayam
చట్టాలపై సరైన అవగాహన ఉంటేనే ప్రజలు మోసాలకు గురికాకుండా ఉంటారని XIII అదనపు జిల్లా జడ్జి బి.హెచ్.వి. లక్ష్మీకుమారి సూచించారు. గురువారం రామచంద్రాపురం కోర్టు నుంచి రాజగోపాల్ సెంటర్ వరకు లోక్ అదాలత్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఉచిత న్యాయ సాయం, వరకట్న నిషేధం, బాల్య వివాహాల నిరోధక చట్టాలపై ప్రజలకు చైతన్యం కల్పించారు. కార్యక్రమంలో న్యాయాధికారులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...