Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

CSDT కి రేషన్ డీలర్ల వినతి

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Aug 29, 2026 7:23 PM విజయనగరంGeneral
CSDT కి రేషన్ డీలర్ల వినతి - Udayam
విజయనగరం జిల్లా సంతకవిటి మండలం రేషన్‌ డీలర్లు సమస్యలపై శనివారం CSDT అనంత్‌కు వినతిపత్రం అందజేశారు. MLS పాయింట్‌ నుంచి బియ్యం బస్తాలు వచ్చినప్పుడు QR కోడ్‌ స్కాన్‌ చేయాలని సూచిస్తున్నారని, దీనివల్ల పని భారం పెరుగుతోందని తెలిపారు. 2017లో పెంచిన కమిషన్‌నే ఇప్పటికీ ఇస్తున్నారని, కమిషన్‌ను పెంచాలని కోరారు. గతంలో ఐదు రోజుల్లో అందే కమిషన్‌ ప్రస్తుతం 25 రోజులు దాటినా ఆందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...