Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సరిహద్దు దాటించిన స్నాప్‌చాట్‌ ప్రేమ

Follow Udayam on Google
అనురూప్ గౌడ్ Jul 05, 2026 8:54 PM జాతీయంGeneral
సరిహద్దు దాటించిన స్నాప్‌చాట్‌ ప్రేమ - Udayam
ప్రేమించిన యువతిని కలుసుకోవడంతో పాటు తన పూర్వీకుల ఆస్తిని దక్కించుకోవాలనే ఉద్దేశంతో భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించిన పాక్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)కు చెందిన జీషాన్ మీర్‌ను(22) భారత సైన్యం తిరిగి పాకిస్థాన్‌కు అప్పగించింది. జమ్ముకశ్మీర్‌కు చెందిన ఇరమ్ బానోతో అతడికి స్నాప్‌చాట్‌లో పరిచయం ప్రేమగా మారింది. భారత్‌కు వచ్చి లొంగిపోయి, శిక్ష అనుభవించాక ఇక్కడే ఆమెను పెళ్లి చేసుకుని స్థిరపడాలని ప్లాన్ చేశాడు. ఈ క్రమంలో మే 31న ఎల్ఓసీ దాటుతుండగా సైన్యం పట్టుకుంది. అతడి వెనుక ఎలాంటి ఉగ్రవాద కోణం లేదని దర్యాప్తులో నిర్ధారించిన భద్రతా బలగాలు, చట్టపరమైన ప్రక్రియ పూర్తి చేసి శనివారం పాక్‌కు పంపించేశాయి.

Comments

G
Loading comments...