Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జగన్‌ను తుగ్లక్ మామయ్యగా పేర్కొంటూ విమర్శలు గుప్పించిన ఎమ్మెల్యే

Follow Udayam on Google
భవేష్ కుమార్ Jul 19, 2026 3:48 PM ఎన్టీఆర్ జిల్లాGeneral
జగన్‌ను తుగ్లక్ మామయ్యగా పేర్కొంటూ విమర్శలు గుప్పించిన ఎమ్మెల్యే - Udayam
అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మాజీ సీఎం జగన్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. స్థానిక ఎస్సీ బాలుర వసతి గృహాన్ని సందర్శించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత పాలనలో విద్యా వ్యవస్థ నిర్వీర్యమైందని, విద్యార్థుల వస్తువులపై కూడా జగన్ ఫోటోలు వేయించుకుని తుగ్లక్ తరహాలో వ్యవహరించారని ఎద్దేవా చేశారు. అందుకే విద్యార్థులు ఆయన్ని తుగ్లక్ మామయ్య అని పిలుస్తున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం, మంత్రి లోకేశ్ ఆధ్వర్యంలో విద్యాశాఖలో వస్తున్న మార్పులు ఆదర్శంగా నిలుస్తున్నాయని, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలు పెరుగుతున్నాయని ఆయన తెలిపారు.

Comments

G
Loading comments...