వార్తలకు తిరిగి వెళ్లండి

తప్పుల్లేని ఓటర్ల జాబితా తయారీకి బీఎల్‌వోలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని నల్లజర్ల తహసీల్దార్ ఎస్.వి.ఎస్. నాయుడు సూచించారు. గురువారం నల్లజర్ల మండల పరిషత్ కార్యాలయంలో బీఎల్‌వోలతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు.
ముసాయిదా ఓటర్ల జాబితాపై అభ్యంతరాలను స్వీకరించి, జాబితాను సరిచేయాలని సూచించారు. సమావేశంలో మండల స్థాయి అధికారులు, బీఎల్‌వోలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

