Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆగస్టు 10 జైలు భరోకు సీపీఎం పిలుపు

Follow Udayam on Google
నవీన్ రెడ్డి Jul 31, 2026 4:13 PM సూర్యాపేటGeneral
ఆగస్టు 10 జైలు భరోకు సీపీఎం పిలుపు - Udayam
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు నిరసనగా ఆగస్టు 10న నిర్వహించే జైలు భరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు కొలిశెట్టి యాదగిరిరావు పిలుపునిచ్చారు. తుంగతుర్తిలో కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. రైతులు, కార్మికుల సమస్యలు పరిష్కరించి ఎన్నికల హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలు పెద్దఎత్తున జైలు భరోలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

Comments

G
Loading comments...