Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోర్టు భవనానికి యజమాని తాళం!

Follow Udayam on Google
భవేష్ కుమార్ Jul 01, 2026 3:07 PM పెద్దపల్లి General
కోర్టు భవనానికి యజమాని తాళం! - Udayam
పెద్దపల్లి జిల్లా ఓదెలలో అద్దె చెల్లించడం లేదని ఆరోపిస్తూ, జూనియర్ సివిల్ జడ్జి కోర్టు భవనానికి యజమాని ముంజాల మధు తాళం వేశారు. ఏడు నెలలుగా అద్దె చెల్లించకుండా కాలయాపన చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అద్దె డబ్బుల కోసం పలుమార్లు అడిగినా ఫలితం లేకపోవడంతో, విధిలేని పరిస్థితుల్లోనే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఇంటి యజమాని తెలిపారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.

Comments

G
Loading comments...