వార్తలకు తిరిగి వెళ్లండి
దంపతుల ఆరేళ్ల వెట్టిచాకిరి గుట్టురట్టు

రూ.3 లక్షల అప్పు తీసుకున్నందుకు ఓ దంపతులను ఆరేళ్లుగా వెట్టిచాకిరి చేయిస్తున్న దారుణ ఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. శ్రీకాకుళానికి చెందిన శ్రీనివాస్, రమ్యలను కాంట్రాక్టర్లు రాములు, కృష్ణ కేవలం ఆహార ఖర్చులు ఇస్తూ బంధించి పని చేయించుకుంటున్నారు.
బాధితుల బంధువుల సమాచారంతో ఓ స్వచ్ఛంద సంస్థ పోలీసులకు, కార్మిక శాఖకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన అధికారులు విచారణ జరిపి నిందితులపై కేసు నమోదు చేశారు. బాధితులను వారి కుటుంబ సభ్యుల వద్దకు చేర్చారు.
Comments
Loading comments...