Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వర్షాల్లేక ఎండిపోతున్న పత్తి పంటలు

Follow Udayam on Google
భవ్య శ్రీ Jul 09, 2026 8:32 AM కర్నూలుGeneral
వర్షాల్లేక ఎండిపోతున్న పత్తి పంటలు - Udayam
జూన్ మొదటి వారంలో కురిసిన జల్లులకు పత్తి సాగు చేసిన రైతులకు తీవ్ర నిరాశే ఎదురవుతోంది. నెల రోజులుగా వర్షాలు లేకపోవడం, ఉష్ణోగ్రతలు పెరగడంతో వేలాది హెక్టార్లలో పత్తి మొక్కలు ఎండిపోయి వాడిపోతున్నాయి. లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టినా పంట దక్కే పరిస్థితి లేకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎల్‌నినో ప్రభావంతో నెలకొన్న ఈ కరవు పరిస్థితుల వల్ల బతుకుదెరువు కోసం వలస బాట పట్టాల్సిన దుస్థితి వచ్చిందని అన్నదాతలు కన్నీరుమున్నీరవుతున్నారు.

Comments

G
Loading comments...