వార్తలకు తిరిగి వెళ్లండి
కనిగిరి నియోజకవర్గవ్యాప్తంగా శనివారం ఉదయం నుంచి వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. గత కొన్ని రోజులుగా తీవ్రమైన ఎండలు, ఉక్కపోతతో సతమతమవుతున్న ప్రజలకు ఈ మార్పు పెద్ద ఉపశమనాన్ని ఇచ్చింది. పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి తేలికపాటి వర్షం కురవడంతో జనజీవనం ఆహ్లాదకరంగా మారింది.
నియోజకవర్గవ్యాప్తంగా మోస్తరు వాన పడితే, వెలిగండ్ల మండలంలో మాత్రం వర్షం దంచికొట్టింది. ఆకాశం పూర్తిగా మేఘావృతమై చల్లని గాలులు వీయడంతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.
Comments
Loading comments...

