Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కుళ్లిన మాంసంతో వంటలు

Follow Udayam on Google
సంజయ్ రెడ్డి Jul 02, 2026 5:31 PM హైదరాబాద్General
కుళ్లిన మాంసంతో వంటలు - Udayam
హైదరాబాద్ ఉప్పరపల్లిలోని ప్రముఖ బార్బెక్యూ నేషన్ రెస్టారెంట్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించి షాకింగ్ నిజాలను వెలుగులోకి తెచ్చారు. ఫ్రిజ్‌లో నిల్వ ఉంచిన కుళ్లిన మాంసం, పాడైపోయిన పండ్లు, ఐస్‌క్రీమ్‌లను గుర్తించి అధికారులు వాటిని సీజ్ చేశారు. గడువు ముగిసిన ఆహార పదార్థాలపై కొత్త స్టిక్కర్లు వేసి వాడుతున్నట్లు అధికారులు నిర్ధారించారు. కిచెన్‌ అపరిశుభ్రతపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపారు. అక్కడ తిని ఇద్దరు ఫుడ్ పాయిజన్‌కు గురైనట్లు వెల్లడించారు.

Comments

G
Loading comments...