Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొండగట్టు అంజన్న దర్శనంపై అక్రమ వసూళ్ల వివాదం

Follow Udayam on Google
నిహారిక రెడ్డి Jul 28, 2026 9:31 AM కరీంనగర్General
కొండగట్టు అంజన్న దర్శనంపై అక్రమ వసూళ్ల వివాదం - Udayam
కొండగట్టు అంజన్న దర్శనానికి వచ్చే భక్తుల నుంచి కొందరు ఆలయ ఉద్యోగులు అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. ప్రత్యేక దర్శనం పేరుతో రూ.2 వేలు తీసుకున్న ఘటనపై ఈవో విచారణ చేపట్టారు. ఆలయంలో పనిచేసే ఇద్దరు ఉద్యోగులను ప్రశ్నించిన ఈవో, డబ్బులు ఎవరు తీసుకున్నారని నిలదీసినట్లు సమాచారం. ఘటనపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

Comments

G
Loading comments...