వార్తలకు తిరిగి వెళ్లండి
కృష్ణా, భీమా నదులపై బ్యారేజీల నిర్మాణానికి శ్రీకారం!

కృష్ణా, భీమా నదులపై రోడ్-కమ్-బ్యారేజీలను నిర్మించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కర్ణాటకతో కలిసి సంయుక్తంగా ఈ ప్రాజెక్టులను చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందుకోసం డీపీఆర్ తయారీకి టెండర్లు ఆహ్వానించనున్నారు.
ఈ బ్యారేజీల నిర్మాణం పూర్తయితే మక్తల్, నారాయణపేట ప్రాంతాల్లో సాగునీటి కొరత తీరుతుంది. సుమారు 12 వేల ఎకరాలకు పైగా కొత్త ఆయకట్టుకు నీరందడంతో పాటు, ఎత్తిపోతల పథకాలకు నిరంతర నీటి లభ్యత ఉంటుంది.
Comments
Loading comments...