Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోలీస్ ఇంట్లో చోరీ.. 28 కాసుల బంగారం అపహరణ

Follow Udayam on Google
vihar Aug 22, 2026 3:49 PM కోనసీమGeneral
పోలీస్ ఇంట్లో చోరీ.. 28 కాసుల బంగారం అపహరణ - Udayam
కొత్తపేట ఆర్.ఎస్.నగర్‌లో పోలీసు కానిస్టేబుల్ చెల్లుబోయిన రాంబాబు ఇంట్లో చోరీ జరిగింది. కుటుంబ సభ్యులు హైదరాబాద్ వెళ్లిన సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు తాళాలు పగలగొట్టి బీరువాను ధ్వంసం చేసి సుమారు 28 కాసుల బంగారం, 750 గ్రాముల వెండి ఆభరణాలు అపహరించారు. ఈనెల 20న ఇంటికి వచ్చిన రాంబాబు చోరీని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్‌ఐ జి.సురేంద్ర కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...