Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ముంబయిలో 15,000 మందిని చంపడానికి కుట్ర

Follow Udayam on Google
సంజయ్ రెడ్డి Jun 28, 2026 1:43 PM జాతీయంGeneral
ముంబయిలో 15,000 మందిని చంపడానికి కుట్ర  - Udayam
ముంబయిలో మొహర్రం వేళ 15,000 మందికి ఎలుకల మందు (జింక్‌ పాస్ఫేట్‌) ఇచ్చి చంపాలనే ఫయాజ్‌ ప్రేమ్‌జీ కుట్రను ఓ మహిళా అప్రమత్తతతో పోలీసులు భగ్నం చేశారు. చాక్లెట్లు, ఇమ్యూనిటీ బూస్టర్లంటూ నిందితుడు విసిరిన క్యాప్సూల్స్‌పై అనుమానమొచ్చి ఆమె పోలీసులకు సమాచారమిచ్చింది. బైకుల్లా పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి 14,900 విషపూరిత క్యాప్సూల్స్, 50 కిలోల కెమికల్ స్వాధీనం చేసుకున్నారు. బీబీఏ చదివి, ఇరాన్, ఇరాక్‌లలో ఉండి వచ్చిన ఈ నిందితుడి అంతర్జాతీయ లింకులు, ఉగ్రకోణంపై ఏటీఎస్ (ATS), ఐబీ (IB) దర్యాప్తు చేస్తున్నాయి. అస్వస్థతకు గురైన 11 మంది కోలుకున్నారు

Comments

G
Loading comments...