Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాపై కుట్ర చేస్తున్నారు: సీఎం రేవంత్‌

Follow Udayam on Google
రవళి దేవి Jul 22, 2026 11:39 AM వికారాబాద్General
నాపై కుట్ర చేస్తున్నారు: సీఎం రేవంత్‌ - Udayam
భాజపా, బీఆర్‌ఎస్‌ల తప్పులను ప్రశ్నిస్తున్నందుకే తనపై కుట్రలు పన్నుతున్నారని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కొడంగల్‌లో కాంగ్రెస్‌కు ఓట్లేసిన వర్గాల ఓట్లను తొలగించేందుకు ఆ పార్టీలు ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు. ఈనెలాఖరు నాటికి కొడంగల్‌లో వంద శాతం ఓటర్ల నమోదు పూర్తి చేయాలని బీఎల్‌ఏలను కోరారు. ఓటర్ల జాబితాలో పేర్లు లేకపోతే సంక్షేమ పథకాలు రావని, అర్హులందరికీ ఓటు హక్కు కల్పించాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...