Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళపై కాంగ్రెస్ నాయకుడి వేధింపులు: సస్పెండ్ చేసిన పార్టీ!

Follow Udayam on Google
Aditi Singh May 19, 2026 5:21 PM హైదరాబాద్General
మహిళపై కాంగ్రెస్ నాయకుడి వేధింపులు: సస్పెండ్ చేసిన పార్టీ! - Udayam
తన కోరిక తీరిస్తేనే ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తానంటూ కామారెడ్డి జిల్లా రాజంపేటకు చెందిన ఓ మహిళపై స్థానిక కాంగ్రెస్ నాయకుడు వేధింపులకు పాల్పడ్డాడు. బాధితురాలు నిరాకరించడంతో, గతంలో వచ్చిన డబుల్ బెడ్రూం ఇండ్ల జాబితా నుండి ఆమె పేరును తొలగించాడు. ఈ వేధింపులపై బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన సంచలనం సృష్టించడంతో స్పందించిన కాంగ్రెస్ అధిష్టానం, సదరు టౌన్ అధ్యక్షుడిని పార్టీ నుండి సస్పెండ్ చేసింది.

Comments

G
Loading comments...