Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెసు హామీలు అమలు కావట్లేదు

Follow Udayam on Google
Harika Aug 31, 2026 1:26 PM పెద్దపల్లి General
కాంగ్రెసు హామీలు అమలు కావట్లేదు - Udayam
ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేయడం లేదని బీజేపీ రాష్ట్ర మహిళా నాయకురాలు లావణ్య ఆరోపించారు. సోమవారం గోదావరిఖని శివాజీనగర్‌లో ఆమె మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు మినహా రాష్ట్రంలో పెద్దగా అభివృద్ధి జరగడం లేదని ఆమె విమర్శించారు. నాలుగు రోజులపాటు నియోజకవర్గంలోని అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు.

Comments

G
Loading comments...