వార్తలకు తిరిగి వెళ్లండి

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం పొలాసలో అటవీ అధికారులు కందకాలు తవ్వుతుండగా గిరిజనులు అడ్డుకున్నారు. తమ సాగు భూములను అటవీశాఖ ఆధీనంలోకి తీసుకుంటున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు.
పులుల సంచారం నేపథ్యంలో అటవీ సంరక్షణ కోసమే ఈ చర్యలని అధికారులు పేర్కొన్నారు. దీనిపై ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరగడంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. చివరకు పోలీసులు జోక్యం చేసుకుని సర్దిచెప్పారు.
Comments
Loading comments...

