Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డబుల్ బెడ్‌రూం ఇళ్లపై ఫిర్యాదులు

Follow Udayam on Google
అనురూప్ గౌడ్ Jul 29, 2026 11:30 AM నిర్మల్ General
డబుల్ బెడ్‌రూం ఇళ్లపై ఫిర్యాదులు - Udayam
ఖానాపూర్‌లో పంపిణీ చేసిన డబుల్ బెడ్‌రూం ఇళ్ల కేటాయింపుపై పేదలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అనర్హులకు ఇళ్లు కేటాయించడంతో 150కుపైగా గృహాలు ఖాళీగా ఉన్నాయని, అర్హులైన నిరుపేదలకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు. ఇళ్ల పంపిణీలో అవకతవకలపై వచ్చిన ఫిర్యాదులతో అధికారులు సర్వే చేపట్టారు. అయితే సమగ్ర విచారణ నిర్వహించి అర్హులకే ఇళ్లు కేటాయించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Comments

G
Loading comments...