Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చెరువుల కబ్జాలపై హైడ్రాకు ఫిర్యాదు

Follow Udayam on Google
పవన్ కుమార్ Aug 14, 2026 12:51 PM సిద్దిపేటGeneral
చెరువుల కబ్జాలపై హైడ్రాకు ఫిర్యాదు - Udayam
సిద్దిపేటలో చెరువుల ఆక్రమణలను అడ్డుకోవాలని చిన్నకోడూరు, నంగునూరు ఏఎంసీ ఛైర్మన్లు మీసం మహేందర్‌, దేవులపల్లి యాదగిరి హైడ్రాను కోరారు. గురువారం హైదరాబాద్‌లో హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ను కలిసి వినతిపత్రం అందించారు. కోమటి చెరువు, పెద్ద కాలువ, కప్పలకుంట, ఎర్రకుంట, మచ్చవానికుంట, చింతలచెరువు, నర్సాపూర్‌ చెరువులు ఆక్రమణలకు గురవుతున్నాయని తెలిపారు. చెరువులను కాపాడాలని కోరారు.

Comments

G
Loading comments...