వార్తలకు తిరిగి వెళ్లండి

పెనుకొండ తహశీల్దార్ కార్యాలయాన్ని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయ నిర్వహణ, మీ-సేవా దరఖాస్తులు, పెండింగ్ ఫైళ్లు, రెవెన్యూ రికార్డులను పరిశీలించారు.
ప్రజల వినతులను నిర్దేశిత గడువులోగా నాణ్యతతో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. తనిఖీలో ఆర్డీవో ఆనంద్ కుమార్, తహశీల్దార్ స్వాతి తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

