Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పంటల బీమాపై కలెక్టర్ కీలక ఆదేశాలు

Follow Udayam on Google
అనురూప్ గౌడ్ Aug 13, 2026 12:02 PM విజయనగరంGeneral
పంటల బీమాపై కలెక్టర్ కీలక ఆదేశాలు - Udayam
ఆగస్టు 15లోగా పంటల బీమా నమోదు పూర్తి చేయాలని విజయనగరం కలెక్టర్ రాంసుందర్ రెడ్డి వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. పంటల బీమా, ఈ-పంట, రైతు ఐడీ, ఎరువుల పంపిణీపై బుధవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. అర్హులైన రైతులందరూ బీమాలో చేరేలా అవగాహన కల్పించాలని సూచించారు. ఎరువుల నిల్వలు, పంపిణీని పర్యవేక్షిస్తూ, ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు.

Comments

G
Loading comments...