Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లెక్కల మాస్టారుగా మారిన కలెక్టర్.. విద్యార్థులకు పాఠాలు బోధన

Follow Udayam on Google
అమరేష్ గౌడ్ Jul 15, 2026 5:07 PM విజయనగరంGeneral
లెక్కల మాస్టారుగా మారిన కలెక్టర్.. విద్యార్థులకు పాఠాలు బోధన - Udayam
విజయనగరం రూరల్ పరిధిలోని గరివిడి మండలం కొండపాలెం ప్రాథమిక పాఠశాలను కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదులను సందర్శించిన ఆయన, స్వయంగా బ్లాక్‌బోర్డ్‌పై విద్యార్థులకు గణిత పాఠాలు బోధించి వారి ప్రతిభను పరీక్షించారు. అనంతరం పాఠశాలలో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకాన్ని కలెక్టర్ పరిశీలించారు. విద్యార్థులకు నిబంధనల ప్రకారం నాణ్యమైన, పరిశుభ్రమైన పోషకాహారాన్ని అందించాలని అక్కడి అధికారులను, పాఠశాల సిబ్బందిని ఆయన ఆదేశించారు.

Comments

G
Loading comments...