వార్తలకు తిరిగి వెళ్లండి

సహజవాయువు కొరతను అధిగమించేందుకు బొగ్గు నుండి సింథటిక్ గ్యాస్ (సింగ్యాస్) ఉత్పత్తి చేయాలని కోల్ ఇండియా నిర్ణయించింది. జాతీయ బొగ్గు గ్యాసిఫికేషన్ మిషన్‌లో భాగంగా విద్యుత్, ఎరువులు, స్టీల్ పరిశ్రమల అవసరాల కోసం ఈ ప్లాంట్లను నిర్మించనున్నారు.
దీనికోసం రెండు నమూనాలను ప్రతిపాదించారు. మొదటి విధానంలో బొగ్గు గనుల వద్ద ప్లాంట్ నిర్మించి పైప్‌లైన్ ద్వారా సరఫరా చేస్తారు. రెండో విధానంలో రవాణా ఖర్చులు తగ్గించేందుకు నేరుగా పరిశ్రమల పక్కనే సింగ్యాస్ కేంద్రాలను ఏర్పాటు చేస్తారు.
Comments
Loading comments...

