Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.24 కోట్ల సీఎంఆర్‌ మాయం

హరిక శర్మ Jul 26, 2026 9:41 PM నల్గొండabout 1 hour ago
రూ.24 కోట్ల సీఎంఆర్‌ మాయం - Udayam Digital
యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఓ రైస్‌ మిల్లులో రూ.24.30 కోట్ల విలువైన సీఎంఆర్‌ బియ్యం మాయమైన ఘటన కలకలం రేపింది. అనంతారం గ్రామంలోని యాదాద్రి రైస్‌ ఇండస్ట్రీలో ఈ అక్రమం వెలుగుచూసింది. 2022-23, 2024-25 రబీ సీజన్లకు చెందిన 6,700 మెట్రిక్‌ టన్నుల బియ్యం కనిపించకపోవడంతో అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిల్లుకు చెందిన ఐదుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Comments

G
Loading comments...