వార్తలకు తిరిగి వెళ్లండి

జొన్నగిరిలో బుధవారం (జూన్ 24) ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన నేపథ్యంలో, పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ పర్యవేక్షణలో 1,200 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
హెలిప్యాడ్, సభా ప్రాంగణం పరిసరాల్లో ముగ్గురు అడిషనల్ ఎస్పీలు, 14 మంది డీఎస్పీలు, 40 మంది సీఐలు, 76 మంది ఎస్సైలతో కూడిన బృందం భద్రతా విధుల్లో పాల్గొంటోంది. ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేసేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎస్పీ సూచించారు.
Comments
Loading comments...

