Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నరసాపురం ఎమ్మెల్యే పనితీరుపై సీఎం అసంతృప్తి

Follow Udayam on Google
Anuroop Sep 01, 2026 4:39 PM పశ్చిమగోదావరి General
నరసాపురం ఎమ్మెల్యే పనితీరుపై సీఎం అసంతృప్తి - Udayam
నరసాపురం నియోజకవర్గంలో ప్రభుత్వ శాఖల పనితీరు ఆశించిన స్థాయిలో లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. మొగల్తూరు సభలో ఎమ్మెల్యే నాయకర్‌ను ఉద్దేశించి “మీ నియోజకవర్గం పనితీరు బాగోలేదు.. పద్ధతి మార్చుకోవాలి” అంటూ హెచ్చరించారు. 25 శాఖల పనితీరులో 23 మైనస్‌లో ఉన్నాయన్నారు. నోడల్‌ అధికారి పనితీరుపైనా అసంతృప్తి వ్యక్తం చేసిన సీఎం, తక్షణమే నోడల్‌ అధికారిని మార్చాలని కలెక్టర్‌ను ఆదేశించారు.

Comments

G
Loading comments...