వార్తలకు తిరిగి వెళ్లండి

అరుణాచల్ ప్రదేశ్‌లో వరద ఉధృతి, నష్ట తీవ్రతపై ముఖ్యమంత్రి పెమా ఖండూ వైమానిక, భూతల సర్వేల ద్వారా ప్రత్యక్షంగా సమీక్షించారు. కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, కిరణ్ రిజిజులతో కలిసి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఆయన, స్వయంగా క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించారు. అనంతరం పాసిఘాట్‌లోని బోయింగ్ గ్రామంలో వరద బాధితులను కలిసి, వారికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
Comments
Loading comments...

