Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నల్లగొండలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన

Follow Udayam on Google
నవీన్ రెడ్డి Jun 25, 2026 12:43 PM నల్గొండGeneral
నల్లగొండలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన - Udayam
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈనెల 28న నల్లగొండ జిల్లాలో పర్యటించనున్నారు. కనగల్ మండలంలో రూ. 13,000 కోట్ల వ్యయంతో చేపట్టే 'హ్యామ్' (HAM) రోడ్ల నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేస్తారు. అనంతరం నల్లగొండ మున్సిపాలిటీకి తాగునీటి ప్రాజెక్టుకు పునాది వేయడంతో పాటు, ఎన్జీ కాలేజీ మైదానంలో జరిగే బహిరంగ సభలో పాల్గొని స్వయం సహాయక సంఘాల మహిళలకు చెక్కులను పంపిణీ చేయనున్నారు.

Comments

G
Loading comments...